Tuesday, August 3, 2021

మా లోచనలు..... 

1) నిఘంటు నిర్మాణాలను విస్తృతంగా చేపట్టి తద్వారా భాషా వ్యాప్తికి తోడ్పడటం.

2) ప్రసార, మాధ్యమాల ద్వారా వ్యవహార భాషను ప్రోత్సహించటం.
3) ప్రభుత్వ కార్యాలయాల్లో, న్యాయస్థానాల్లో తెలుగును తప్పనిసరి చేయడం.
4) గ్రంథాలయాల స్థాపన లను ఎక్కువగా ప్రారంభించుట, పుస్తకపఠనం మీద ఆసక్తిని కలిగించడం _ తద్వారా భాషా వ్యాప్తికి దోహదం చేయడం.
5) దేశంలోని వివిధ సంస్థలతో కలిసి భాషాపరమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం.
6) భాష పై ఆసక్తి కలిగేలా, భాషా చరిత్రకు , భాష కోసం కృషి చేసిన వారిపై చలనచిత్రాలను రూపొందించి చూపియడం.
7) నేడు విస్తృతంగా అభివృద్ధి చెందిన అంతర్జాలం ద్వారా భాషను అందరికీ మరింత చేరువ చేయుట.
8) భాషాభివృద్ధికి, భాషను విస్తృతంగా చేరువ చేయ్యటానికి యువతను ప్రధాన సాధనంగా వినియోగించాలి.
9) కవులను ప్రోత్సహించటం, యువత రచనకు, ప్రచురణకు ప్రభుత్వాలు తోడ్పాటు నివ్వడం.
10) అన్ని దేశాలలో తెలుగు భాషను ఐచ్ఛిక భాషగా బోధించే లా చూడటం.

పై రంగాలలో తమకు గల ఆసక్తిని అభివ్యక్తిస్తారని ఆశిస్తూ...

మా లక్ష్యసాధనకు తమ చేయిని అందించమని ప్రార్ధిస్తూ....

శ్రీ వాగ్దేవీ కళా పీఠం.

మా లోచనలు.....  1) నిఘంటు నిర్మాణాలను విస్తృతంగా చేపట్టి తద్వారా భాషా వ్యాప్తికి తోడ్పడటం. 2) ప్రసార, మాధ్యమాల ద్వారా వ్యవహార భాషను ప్రోత్సహ...